Thursday, January 15, 2009

హేమంతపు ఉదయం


వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు


ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు

ఆవిష్కరించే అందమైన చిత్రాలు
మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య

చలిమంటల వెచ్చదనాలు

ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు

మనసునిండుగా హరిదాసు దీవెనలు


ఎంత పొద్దెక్కినా

సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో

చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

48 comments:

Anonymous said...

మనసులోని మాటను బహు ముచ్చటగా వ్యక్తం చేశారు సుమండీ!!
అందమైన కవిత, నిజంగా!!

Anonymous said...

పల్లెకు పోతే కలిగే అనుభూతిని, సిటిలో ఉన్నా ఊరులోనే ఉన్నామన్న బావాన్ని కలిగించింది మీ కవిత.బావుంది.

వేణూశ్రీకాంత్ said...

అద్భుతం రాధిక గారు... ధనుర్మాసపు ఉదయాన్ని చాలా చక్క గా వర్ణించారు. విడవని బాణాలు విచ్చుకోని వర్ణాలు చాలా బాగున్నాయి. ఫోటో కూడా చాలా బాగుంది బోలెడు ఙ్ఞాపకాలను కదిలించింది.

Venky said...

aaahaaa !!! chaalaa baagaa varninchaaru raadhika gaaroo !! chivari rendu lines adbhutam gaa vunnaayi !! :-)

నిషిగంధ said...

"ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో..

చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో!"

SUPER! :-)

ఆత్రేయ కొండూరు said...

రాధిక గారు
"చలిగిలికి ఇంకా విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో"
చాలా బాగా రాశారు

సూరీడి చూడని కోణాల నుంచి తాను విడవని బాణాలు పంచి చలిగిలికి వెచ్చగాని హృదయాలు తడిమారు.

అభినందనలు

Anonymous said...

anubhavalani aksharallo imadchadam kastamanunna , kani mee kavita chadivaka aksharalato anubhvaniki marinta andam addachoni anipistundi.

simply superb andi , mee kavitalu anni

Unknown said...

చాలా బాగుందండి కవిత రాధిక గారు.
పదాల అల్లిక, వాడుక రెండూ అద్భుతం !

చలిలో భోగిమంటల దగ్గర కూర్చుంటే వచ్చే వెచ్చదనం లా అనిపించింది మీ కవిత చదువుతుంటే !
:)

మధురవాణి said...

మీ కవిత సంక్రాంతి పొద్దుని కళ్ళకి కట్టినట్టు, మనసుకు హత్తుకొనేట్టు చేసింది.
చాలా బావుంది :)

ప్రపుల్ల చంద్ర said...

"చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో"
చాలా బాగా వ్రాసారు.

నేస్తం said...

"ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో.."

ఫోటో చాలా బాగుంది .. అందమైన కవిత..
చాలా బాగా రాశారు

Anonymous said...

తాతయ్య ప్రక్కన వెచ్చగా తొంగున్న పసిదనం
అమ్మమ్మ చెంగులాగి ఆటాడించిన ఆకతాయితనం
సంకురాత్రి ముగ్గులకి గొబ్బిళ్ళ దొంగతనం
భోగిమంటలకి పాత కలప పోగేయటం
పాలతాలికలకి అక్కా చెల్లి సంవాదం
తంపటేసిన తేగలకి అన్నదమ్ముల ఆరాటం
అరిశలపిండి వేగేదాకా ఆగలేని అమాయకత్వం
గుమ్మడి పదుల్లో కోడిపిల్లల పారాడటం
ముక్కోటి తిరణాళ్ళలో గోళిసోడా దొమ్ములాటలు
రాములోరి గుడికి శివాలయం పూజారి ఆగమనం
అన్నీ వతనుగా ఏటేటా ముంగిళ్ళకి తెచ్చే మా సంక్రాంతి
ఆదమరిచి నిదరోనీయని చలిబారిబడ్డ వొళ్ళ కోలాటం
అమ్మో ఎంత తీపి గురుతులో ఈ ధనుర్మాసం వేకువలు!

లక్ష్మి said...

maa uru gurthuku vachindi, bagundi :)

Kathi Mahesh Kumar said...

బాగుంది కానీ....

pruthviraj said...

wow!
ఉన్నది ఉన్నట్లుగా ఉంది. కానీ మన అచ్చతెలుగులో మీ కవితలో ఇంకా బాగుంది ఈ ప్రకృతి.

సుభద్ర said...

super ,meeku basha mida pattu leka povadamemiti....

చైతన్య.ఎస్ said...

రాధిక గారు చాలా బాగుంది.

Anonymous said...

రాధిక గారు..

మీ అందమైన భావాలను డైరీగా రాస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది.మీ తాజా పొయెట్రీ వెచ్చగా ఉంది.భోగినాటి చలిమంటలా.-మాధవ్, హైదరాబాద్

Gopala said...

నా బ్లాగు చదివినందుకు కృతజ్ఞతలు! మీ బ్లాగుకి నా బ్లాగు నుంచి లంకె వేసాను!

మీ గోపాళం!

జాన్‌హైడ్ కనుమూరి said...

భావపరంగా, జ్ఞాపకాల పరంగా కవిత బాగుంది కానీ...
విస్తృతంగా రాస్తున్న మీ పటిమ, కవిత్వ పరంగా సందిగ్దంగా అనిపించింది నాకు.

Aditya said...

అచ్చ తెలుగు పల్లె సంక్రాంతి ని భలే రాసారు చాల నచ్చింది నాకు.

Anonymous said...

ఇంకా సంక్రాంతిగురించిన ఆలోచనలు ఎవరికైనా వుండి వుంటాయా అనుకుంటుంటా అప్పుడప్పుడు. నాకూ అచ్చంగా ఇలాటి ఆలోచనలే వస్తాయి.
జాన్ హైడ్ గారి వ్యాఖ్య నాకు ఆశ్చర్యంగా వుంది. నేనేమో కొన్ని ఇతర కవితలకంటే ఇందులోనే కవితా ధార వచ్చింది అనుకున్నాను. ఇందులో వాక్యాలు పొందిగ్గా, చిక్కగా వున్నాయ అని.

Bolloju Baba said...

చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

గిలి అంటే ఇప్పుడే చూసాను. భయం అని.

విన్నపదమైనా కొత్తగా ద్వనించేసరికి అనుమానం వచ్చి చూసాను. కరక్టుగా సరిపోయింది. మంచి ప్రయోగం.
మంచి కవిత.
అభినందనలు

ఏకాంతపు దిలీప్ said...

ఆ ఫొటో లు ఎక్కడ దొరుకుతాయో, వాటికి అచ్చంగా అక్షరాలు ఎలా సరిపోతాయో!
మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నాను...

రాధిక said...

@దిలీప్,వేణూ గారూ ఆ ఫొటో గోదావరి బ్లాగ్ విశ్వనాధ్ గారు ఇచ్చారండి.ఎంత చక్కగా సరిపోయేలా చేసి ఇచారో.ఆయనకి బోలెడు థాంకులు.
మాలతి,జయ థాంక్స్ అండి.
నిషీ,వెంకి విచ్చుకోని పూలు మంచు చుక్కలతో చాలా ముద్దుగా వుంటాయి.అందుకే ఆ లైన్లు నచ్చినట్టునాయి మీకు :)
ఆత్రేయ గారు థాంక్స్.ముందు కవితలో మీరు చెప్పిన తప్పులను ఒప్పుకోకుండా సమర్ధించుకున్నాననా ఈకవిత ని మెచ్చుకున్నారు :)
వెణు,మధురవాణీ,ప్రపుల్ల చంద్ర,నేస్తం అందైకీ కామెంటినందుకు థాంక్స్.

రాధిక said...

ఉషా గారూ ఏమీ బాగోలేండి.నా బ్లాగులోకొచ్చి నాకవితకన్నా అందమయిన మాటలలో కామెంటు పెడతారా?నేనొప్పుకోను :) నేను చెప్పలేకపోయిన[మర్చిపోయినవి కాదు సుమా]చాలా విషయాలు మీ కామెంటులో చెప్పి ఈ పేజీకి నిండుతనం తెచ్చారు.థాంక్స్ థాంక్స్.
లక్ష్మి గారు,వరమ గారు,చైతన్య,ఆదిత్య,రఘునందన్ గార్లు మీ అభిమానానికి థాంక్స్.

రాధిక said...

మహేష్ గారూ కానీ...అని ఆగిపోయారు.చెప్పండి సార్.మొహమాటపడొద్దు.మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది.
సుభద్ర గారూ నిజమమండి.నాకు భాష మీద పట్టులేదు.ఒకసారి కవితలన్నీ చూడండి.అవే మాటలు,అవే పదాలు,అవే భావాలు.
గోపాళం గారూ లంకె వేసినందుకు థాంక్స్.
జాన్ గారూ మీ మైల్ కోసం ఎదురుచూస్తున్నాను.
బాబాగారూ నేను గిలి అంటే ఆ అర్ధం లో రాయలేదండి.భయం అనే అర్ధం వుందని తెలియదు కూడా మీరు చెప్పేదాకా.ఏదో అలా కలసి వచ్చేసిందంతే.థాంక్స్.
మాలతి గారూ అవునా అలా అంటారా.అంతా మీ అభిమానమండి.

రాధిక said...

పాపం అందరూ అనానిమస్ లని తిడతారుగానీ నా బ్లాగులో కామెంటే అందరూ మంచి అనానిమస్ లే.ఎప్పుడో ఎక్కడో తప్ప పెద్దగా తిట్టలేదు.అందుల్కే నాకు నా బ్లాగు వరకు అనానిమస్ లు అంటే చాలా ఇష్టం :) థాంక్స్ అనానిమస్ అన్నయ్యలూ.

Anonymous said...

no problem sister :)

టెంప్లేటు మార్చిన తర్వాత మీ బ్లాగు చాలా బాగుంది.

మీ కవితలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయన్నది చెప్పనక్కర్లేదనుకుంటా :)

Anonymous said...

అనానిమస్సుల్లో అన్నయ్యలు మాత్రమే నా... అక్కయ్యలు ఉండరా? మీ స్త్రీ దురహంకారాన్ని నేను ఖండిస్తున్నాను. పురుష అనానిమస్సునైన నా మనోభావాలు దెబ్బతిన్నాయి.

kidding... :)

Anonymous said...

Anonymous lani mechukunnanduku dhanyavadaalu:)Mee kavitha adbhtam:)

GIREESH K. said...

చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో!"

ఎన్నో ఙాపకాల గిలిగింతలను తట్టిలేపింది మీ కవిత...చాలా బాగుంది. అభినందనలు!

Rama Deepthi Muddu said...

What a wonderful morning!
very well written. could imagine the soothing dew, warm airs of the bonfire, sharp sunrays and a very beautiful morning.
thanks for the treat.
keep posting. Belated Sankranthi subhakankshalu.
luv
JOSH

Unknown said...

dhanurmaasapu poddu,ramya varNa saMBaritaMgaa unnadi ,phoTO ,mI blog kUDA colourful gaa unnaayi ,sOdari raadhika gaarU!

రాఘవ said...

ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో

చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో


సిసలైన భావుకతని చూపించారు. భలే.

Chiranjeevi Nvv said...

మధురం సుమధురం ఈ భావ కవిత.

pavan said...

keka superb expressing the losting tradations of villages and human relations between the people

Anonymous said...

చాలా కాలం తర్వాత మీ బ్లాగుకొచ్చాను. మీ బ్లాగని కాదు అసలు బ్లాగ్లోకంలో లేను నేను. ఇవాళ అలా జ్యోతిగారి బ్లాగులోకెళ్ళి తొంగి చూసి మీ బ్లాగులో వంగి వాలాను. (ఇలా ఎందుకన్నానంటే మా అమ్మ ఎప్పుడూ అనేది బహుసా అదేదొ సామెతనుకుంట "తొంగిచూసి వంగి వాలటం" అని) మీ కవిత చదివితే అందరిలాగే నాకు సంక్రాంతి, సంబరాలూ గుర్తొచ్చాయి. కానీ అదంతా చాలా బాగా మిగతా వాళ్ళు వర్ణించాక ఇంక నేను చెప్పేదేముంటుంది? ముఖ్యంగా ఉషారాణి గారు అసలు సిసలైన పల్లెటూరి ముచ్చట్లని గుర్తుచేసారు.

వసుంధర

తూర్పింటి నరేశ్ కుమార్ said...

మీ కవిత ను చదివానండి ..రాధిక గారు....
మల్లీ ...మల్లీ ....చదివాను....
యాంత్రిక జీవితం లో ఉన్నవారికి....
ఇదొక ...తీపి గులిక ....నిజంగా ...ఓ ..నీలి స్మృతి ... అదొక ఙ్ఞాపకం...తడి ఙ్ఞాపకం...ప్రయాణం లో వెంటాడే స్మృతి





యవనిక ....తీసిన తర్వాత ....నాంది...ప్రస్తావన..తో
మొదలైన నాటకం లా అధ్బుతంగా కొనసాగింది...మీ శైలి ..... naresh.tuurpinti@gmail.com

ఈగ హనుమాన్ (హనీ), said...
This comment has been removed by the author.
ఈగ హనుమాన్ (హనీ), said...

కవిత్వం రాదంటూనే మెత్త మెత్తని భావాల్ని మృధుమధురంగా కవిత్వీకరించిన మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను, సాహితీ మిత్రమా!!
ఈగ హనుమాన్ nanolu.blogspot.com

Unknown said...

so nice.keep it up.

Anonymous said...

so nice.keep it up.

Unknown said...

so nice.keep it up.

Unknown said...

Acha telugu samkramtiki akshara rupanni ichi me kavitato ma manasulani kollagottaru.

ప్రణీత స్వాతి said...

సినిమాల్లో చూసి ఓహో అనుకోవడమే కానీ...
నిజంగా పల్లెటూళ్ళలో సంక్రాంతి ఇంత బాగుంటుందా ?

Nagaraju said...

nice posts,
plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystime.blogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines

Thanks

Unknown said...

good article.
https://goo.gl/Yqzsxr
plz watch our channel.